మినీ ట్యాంక్ బండ్ నిర్వహణను కార్పొరేషన్ అప్పగించండి - ఇరిగేషన్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ప్రధానంగా బోధన్ రోడ్ లో గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిస్థితి, పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అమ్మ వెంచర్ సమీపంలో బ్రిడ్జి ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించారు. నగరంలోని రోడ్లపై ప్యాచ్ వర్క్, రూ.5 కోట్ల స్పెషల్ ఫండ్ స్టేటస్ ను అడిగి తెలుసుకున్నారు.
