📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

మండలంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

◉ Kotha Venugopal   |   ◷ Latest
మండలంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
జన్నారం సాక్షర
జన్నారం మండలంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గంగపుత్రులు జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చెరువులు, కుంటలు, నదులు, జలాశయాలే జీవనాధారంగా తరతరాలుగా చేపల వేట వృత్తిని కొనసాగిస్తున్న సంప్రదాయ గంగపుత్రులు, గుండ్ల బెస్తల జీవన విధానం ప్రత్యేకమైనది. ప్రకృతితో మమేకమై, నీటి ప్రవాహాలు, చేపల కదలికలు, వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ చేపల వేట సాగించడం వీరి వృత్తి నైపుణ్యానికి నిదర్శనం అని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదాయ మత్స్యకారులను తెలంగాణ ఏర్పాటు అయిన నాటి నుండి గుర్తించకపోగా ఇతర కులస్తులకు సొసైటీలు చేస్తూ అసలైన గంగపుత్రుల జీవనోపాధిని కొల్లగొట్టుతున్నారు. ఓట్ల కోసం ప్రాధాన్యత ఇస్తు మా కులవృత్తిని దోపిడీ చేసే విధంగా జరగడం చాలా బాధాకరం అలాగే చాలా చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయని ప్రభుత్వం, అధికారులు కఠినంగా వ్యహరించాలని వారు డిమాండ్ చేశారు ప్రాచీన కాలం నుంచి గంగపుత్రులు, గుండ్ల బెస్తలు తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న చేపల వేట పద్ధతులను నేటికీ కొనసాగిస్తున్నారు. వలలు, తెప్పలు, పడవలు, సంప్రదాయ చేపల వేట పరికరాలను ఉపయోగిస్తూ చెరువులు, నదులు, జలాశయాల్లో చేపల వేట సాగిస్తుంటారు. నీటిలో చేపల సంచారం గుర్తించడం, సరైన సమయంలో వల వేయడం, చేపలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం వంటి అంశాల్లో వీరికి అపారమైన అనుభవం ఉంటుంది.మత్స్యకారుల జీవితం ఎంతో కష్టసాధ్యమైనది. తెల్లవారుజామునే చేపల వేటకు బయలుదేరి, ఎండ, వాన, చలి వంటి ప్రకృతి పరిస్థితులను ఎదుర్కొంటూ కుటుంబ పోషణ కోసం శ్రమిస్తుంటారు. వారి శ్రమ కేవలం కుటుంబ జీవనోపాధికే పరిమితం కాకుండా, ప్రజలకు పోషకాహారమైన చేపలను అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుంది.ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సంప్రదాయ గంగపుత్రులు, గుండ్ల బెస్తల చేపల వేట పద్ధతులను, వారి వృత్తి నైపుణ్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆధునిక కాలంలో మత్స్యకార వృత్తి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, యువతకు ఈ సంప్రదాయ వృత్తిపై అవగాహన కల్పించాలి.గంగపుత్రుల సంప్రదాయం మన సంస్కృతికి ప్రతీక… వారి చేపల వేట మన గ్రామీణ జీవనానికి జీవనాడి… వారి శ్రమకు గౌరవం, వారి కుటుంబాలకు సంక్షేమం, వారి వృత్తికి భవిష్యత్తు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర నాయకులు కల్లెడ నరసయ్య కల్లెడ భూమయ్య గుమ్ముల లింగయ్య కల్లెడ పెద్ద భూమయ్య నాగుల మల్లయ్య పల్లికొండ నర్సయ్య, నారాయణ కొండ్ర పలువురు పాల్గొన్నారు