📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా
  • నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు – అర్హులైన కుటుంబాలకు అవగాహన కల్పించాలి: మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి
నిర్మల్, నవంబర్ 18: సాక్షర ప్రతినిధి.రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు.ఈ పథకం అమలుకు సంబంధించిన అంశాలపై నిర్మల్ పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన మంగళవారం పురపాలక సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ జీవిత బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు సమావేశంలో వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా ప్రయోజనం అందించడం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పట్టణంలోని కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన కుటుంబాలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సభ్యుడిని బీమా పొందే వ్యక్తిగా పరిగణించనున్న నేపథ్యంలో, వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని, ప్రభుత్వ మార్గదర్శకాలు, సంబంధిత నిబంధనల ప్రకారం వివరాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని సూచించారు.ఈ నెల 19 నుంచి పథకం అమల్లోకి రానున్నందున కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ ఎం. రవి బాబు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.