📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం తహసిల్దార్ బక్కయ్య

◉ Kotha Venugopal   |   ◷ Latest
రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం తహసిల్దార్ బక్కయ్య
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో రీ సర్వే తో భూముల అన్ని సమస్యలు పరష్కారం అవుతాయని మండల తహసిల్దార్ బక్కయ్య అన్నారు. సోమవారం రోజున మండలంలోని బొమ్మెన గ్రామంలో రీ సర్వే పనులను ప్రారంబించిన సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో భూ సమస్యలు చాలాకాలంనుండి వున్నాయని రికార్డుల సమస్య హద్దుల సమస్య పట్టమార్పిడి సమస్య ఈ విదంగా అనేక రకరకాల సమస్యలు ఉంటాయని ఈ సమస్యలతో గ్రామాలలో చాలా వివాదాలు గొడవలు జరుగుతాయని ఈ సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని అయన అన్నారు. రాష్ట్రంలోని ఈ గ్రామంలో ఎక్కడకూడా భూమి వివాదాలు సమస్యలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రీ సర్వే ప్రారంబించిందని ఈ సర్వేలతో భూములకు సంబంధించి ఎటువంటి సమస్యలు వున్నా దాదాపుగా పరిష్కారం చేయడానికి మా సిబ్బంది కృషి చేస్తుందని అయన తెలిపారు. ప్రజలు సైతం మా సిబ్బందికి సహకరించి మండలంలోని అన్ని గ్రామాలలో భూముల రీ సర్వే పనులు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసిల్దార్ మష్కూర్ అలీ ఆర్ ఐ వెంకటేశం సర్వేయర్ దినేష్ లైసన్స్ సర్వేయర్ సుదాకర్ సిబ్బంది శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.