📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
21°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

గల్ఫ్ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

◉ Kotha Venugopal   |   ◷ Latest
గల్ఫ్ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామ గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అద్వర్యంలో 72,675/- రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు సమితి అద్యక్షులు ఉప్పు తిరుపతి తెలిపారు. గురువారం రోజున అయన మాట్లాడుతూ గ్రామంలోని గల్ఫ్ కార్మికుడు పురంశెట్టి నగేష్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అయన కుటుంబానికి ఆర్థిక బరోసా కల్పించడానికి ఈ డబ్బులు అందజేయడం జరిగిందని అయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులను అన్ని రకాల ఆదుకుంటాం అని ప్రకటనలు చేస్తున్నారు ఈ ఒక్క హామీ అమలుకావడంలేదని ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని అయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు కుటుంబసబ్యులకు డబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సబ్యులు ఉప్పు సురేష్ ఉప్పు రాజారెడ్డి ఒడ్డేటి రమేష్ ఉప్పు రామన్న సేపూరి సతీష్ కుంట భూమేష్ పులిశెట్టి భూమరేడ్డి పులిశెట్టి భగత్ కుంట రమేష్ పురంశెట్టి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.