📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

నిర్మల్ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే ఏలేటి వినతి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిర్మల్ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే ఏలేటి వినతి
  • సి ఆర్ ఐ ఎఫ్, రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
నిర్మల్ నవంబర్ 19 సాక్షర ప్రతినిధి
నిర్మల్ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని గురువారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించారు.ఈ సందర్భంగా సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సి ఆర్ ఐ ఎఫ్)తో పాటు రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన వివిధ రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.నిర్మల్ నియోజకవర్గంలో రహదారుల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు నిధుల కేటాయింపు ఎంతో అవసరమని ఎమ్మెల్యే వివరించారు.ఈ అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.