ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు.అధికారులకు అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు ఆదేశాలు.
- ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన చిన్నారి నిద్యానకు అభినందనలు
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావుతో కలిసి ఆయన పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి దరఖాస్తుపై బాధ్యతాయుతంగా స్పందించాలని ఆదేశించారు.
ప్రజావాణిలో భాగంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించి ప్రజలు తమ వినతులను అధికారులకు అందజేశారు.
పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి
పిల్లల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలు, వినతులను అధికారులకు సమర్పించారు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన చిన్నారి నిద్యానకు అభినందనలు
ఐదేళ్ల వయసులోనే ఏకకాలంలో రెండు చేతులతో రాస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన చిన్నారి నిద్యానను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు ప్రత్యేకంగా అభినందించారు.
నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన నాళం శ్రవణ్ కుమార్, గౌతమి దంపతుల కుమార్తె నిద్యాన తన అసాధారణ ప్రతిభతో ఈ ఘనత సాధించడం అభినందనీయమన్నారు. చిన్నారిని అభినందించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులోనూ చిన్నారి ప్రతిభను మరింత ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
