గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
- సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి – పుష్కరాల నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలి.. భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బాసరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పుష్కరాల ప్రారంభం నాటికి అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అనంతరం సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
పుష్కరాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి పనుల్లో సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
