📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
  • బీహెచ్‌ఈఎల్ ఎక్స్ రోడ్డులో విగ్రహానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ నాయకులు
రామచంద్రపురం: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బీహెచ్‌ఈఎల్ ఎక్స్ రోడ్డు వద్ద ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. "ఇండియా అంటే ఇందిరా.. ఇందిరా అంటే ఇండియా" అంటూ ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లాకు బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలను తీసుకువచ్చిన ఘనత ఇందిరాగాంధీదేనని అన్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి, వేలాది మందికి ఉపాధి అవకాశాల కల్పనకు బాటలు పడ్డాయని గుర్తుచేశారు. దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆమె తీసుకున్న నిర్ణయాలు, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్, నరేష్ ముదిరాజ్ , హబీబ్ ,నవీన్, పీటర్, రాంజీ, శాంతమ్మ, నాగేష్, సుధాకర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.