📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

నిర్మల్‌లో ఘనంగా నూతన చేయూత పింఛన్ల పంపిణీ

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిర్మల్‌లో ఘనంగా నూతన చేయూత పింఛన్ల పంపిణీ
  • లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ అప్పాల కావ్య
నిర్మల్, నవంబర్ 15 సాక్షర ప్రతినిధి.
నిర్మల్ పట్టణంలోని ఎఫ్ఎసిఎస్ ఫంక్షన్ హాలులో శనివారం నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా పింఛన్లు మంజూరైన పలువురు లబ్ధిదారులకు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నూతన చేయూత పింఛన్ల ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందని, వారి జీవనానికి ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.