- క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 23 : నిజామాబాద్లో నవంబర్ - 2026 నిర్వహించనున్న 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు కార్యక్రమంకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే పోలీస్ క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏసీపీలు , స్పోర్ట్స్ విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ మీట్లో భాగంగా నిర్వహించనున్న క్రీడా పోటీలకు అవసరమైన ట్రాక్ల ఏర్పాటు, క్రీడా మైదానాల సిద్ధీకరణ , క్రీడాకారులకు వసతి సౌకర్యాలు , వైద్య సేవలు , తాగునీటి సరఫరా , భోజన ఏర్పాట్లు తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు. క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన ట్రాక్లను సిద్ధం చేయడంతో పాటు , క్రీడాకారులకు నాణ్యమైన వసతి , భోజనం , తాగునీటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన వైద్య సిబ్బంది , ప్రథమ చికిత్స సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ , వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని , ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ క్రీడలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ( జన్కంపేట్) , అలీ సాగర్ , నాగారం గ్రౌండ్ , కాలూరు రోడ్డు, ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ , ముగుపల్ ఆర్చరీ అకాడమీ మొదలగు ప్రాంతాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్)ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్ , ఆర్మూర్, బోధన్ , సిటిసి , ఏ ఆర్, ఐ టి, సిసిఆర్బి, ట్రాఫిక్ ఏసీపి లు ప్రకాష్ , వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, కృష్ణ , నరేందర్, గురు నాయుడు, మస్తాన్ అలీ, బి. పవన్ కుమార్ (డివై స్ ఓ ), రవీందర్ (ఆర్చరీ కోచ్), మహిపాల్ రెడ్డి (స్విమ్మింగ్ కోచ్), రాజా గౌడ్ (అథ్లెటిక్స్ సెక్రటరీ), విజయ్ కాంత్ రావు (తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ), స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజ్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer