జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ అధికారులు అండగా నిలవాలి.
- తక్కువ నీటితో సాగయ్యే పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలి – జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.రైతులకు అవసరమైన సలహాలు,సూచనలు అందిస్తూ సాగులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే పంటలను మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ, వ్యవసాయ శాఖ అధికారులు అందించే సూచనలు, సలహాలను రైతులు తప్పనిసరిగా పాటించాలని కోరారు.అలాగే జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ వీబీజీ రామ్ జీ పథకం ద్వారా ఉపాధి పొందాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, హార్టికల్చర్ అధికారి రమణ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు అనిల్, సందీప్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీపీఓ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
