📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
State News

ఇల్లు కట్టి చూడు ... పెళ్లి చేసి చూడు.! కాదు!? ఇక ఉచిత వివాహాలు చేసి చూడు అనండీ !

◉ T PRAKASH RAO   |   ◷ Latest
ఇల్లు కట్టి చూడు ... పెళ్లి చేసి చూడు.! కాదు!? 
ఇక ఉచిత వివాహాలు చేసి చూడు అనండీ !
  • రాజకీయ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆదర్శనీయం స్ఫూర్తిదాయకం*
  • తొలి మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ ని అభినందించిన టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్
  • కేక్ కటింగ్ కన్నా ఉచిత సామూహిక వివాహాలు ఆనందాన్ని నింపాయి :ధర్మపురి సంజయ్
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : ఇల్లు కట్టి చూడు ... పెళ్లి చేసి చూడు.! అనేది ఒ మాట! అయితే
ఇక ఉచిత వివాహాలు చేసి చూడు అనండీ అంటున్నారు ప్రజలు. నిజామాబాద్ తొలి మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తన జన్మదినం పురస్కరించుకొని సొంతంగా తన సంతోషం కోసమే నిర్వహించుకోకుండా నిరుపేద జంటలకు అంగరంగ వైభవంగా బ్యాండ్ మేళాలతో సాంప్రదాయం బద్ధంగా ప్రజాప్రతినిధుల ప్రముఖుల ఆశీర్వాదాలు మధ్య నూతన వధూవరులకు తనవంతుగా పుస్తె మట్టెలు పెళ్లి బట్టలు అందించడమే కాకుండా వచ్చిన పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు పరముకులందరికీ చక్కనైన విందు భోజనం అందించి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా సామూహిక వివాహాలు జరిపించడం ఉచిత వివాహాలు చేసి అందరిని అవురా అనిపించారు.... నూతన వధూవరులకు ఈ పెళ్లి వేడుక వారి జీవితంలో మరపురాని ఘట్టంగా మిగిలిపోయింది అనవచ్చు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తన జన్మదిన వేడుకలను నిర్వహించుకోకుండా పేదలకు సహాయంగా నిరుపేదల పెళ్లిళ్లు చేసి తన ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలని తలంపుతో ప్రతి సంవత్సరం అనేక జంటలకు ఉచిత వివాహాలు జరిపిస్తున్నానని తెలిపారు. శనివారం నగరంలోని మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిపిన ఈ పెళ్లి వేడుకలకు అనేకమంది ప్రముఖులు హాజరవడమే కాకుండా నూతన వధూవరులకు తమతోచిన కట్నకాలకు అందజేసి వారికి మరింత సంతోషంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉచిత సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని అన్నారు. శనివారం మాజీ తొలి మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో 8 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎనిమిది జంటలకు పుస్తె మట్టెలు అందజేసి, సాంప్రదాయ బద్ధంగా వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ధర్మపురి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిరుపేద కుటుంబాలకు సామూహిక వివాహాలు జరిపించడం గొప్ప విషయం అన్నారు. రాజకీయ నాయకులు నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలుస్తూ వివాహాలు జరిపించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మంచి కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నామని, ధర్మపురి సంజయ్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలపడమే కాకుండా, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. ఆయనకు సమాజం పట్ల ఎంత బాధ్యత ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు.
కులమతాలకు అతీతంగా వారి వారి సాంప్రదాయలను అనుసరించి వివాహాలు
కులమతాలకు అతీతంగా వారి వారి సాంప్రదాయలను అనుసరించి వివాహాలు జరిపించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. 20 ఏళ్ల క్రితం తాను ఒక మహిళా మాతృమూర్తి ఇచ్చిన సలహాను ఉరికే తీసిపారేయకుండా ఆలోచించి స్తోమత లేని నిరుపేద జంటలకు వివాహం జరిపించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రతి ఏటా కేక్ కటింగ్ లకు ప్రాధాన్యత ఇవ్వకుండా, జన్మదినం సందర్భంగా డబ్బులు ఖర్చు చేయకుండా, నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టానన్నారు. మేళ తాళాలతో ఎంతో వైభవంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు సుమారు 200 లకు పైగా వివాహాలు జరిపించామని గుర్తు చేశారు. వధూవరులకు పుస్తె మట్టెలతో పాటు పట్టు వస్త్రాలు అందజేయడమే కాకుండా సామాగ్రిని కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, గౌడపు శరత్, బంటు బలరాం, కులచారి చారి వెంకటేష్, అపర్ణ, పుప్పాల విజయ, వేణు రాజ్, సీనియర్ నాయకులు ధర్మపురి సంజయ్ అభిమానులు పాల్గొన్నారు.