నిజమాబాద్ ప్రతినిధి, సాక్షర: అయ్యప్ప ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. మండల పూజను పురస్కరించుకొని ఇందూరులోని అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అయ్యప్ప ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పడిపూజ చేయడం దైవానుగ్రహం అన్నారు. ఇందూరులో ప్రతి ఏడాది అయ్యప్ప మాలధారుల సంఖ్య పెరుగుతుందన్నారు. శబరిమలలో ఎలాగైతే ఆలయం ఉంటుందో అదే మాదిరిగా ఇందూరులో ఉండడం విశేషమన్నారు. మహా పడిపూజను ధన్ పాల్ ఉదయ్ కుమార్ స్వామి నిర్వహించారు. పూజా కొనసాగుతున్నంత సేపు పార్శి రాజేందర్ గాన బృందం ఆలపించిన భక్తి పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాలధారులు భక్తి పారవశ్యంలో మునిగారు. కార్యక్రమంలో పలువురు గురు స్వాములు, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer
Advertisement