అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ పతాక ఆవిష్కరణ
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ సంస్థ ఆదేశం అనుసారం మండల మకర విళకు పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణను ఎల్లమ్మ గుట్ట సంస్థ కార్యాలయం ముందు పతాకము జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంజనీర్ గంగాధర్ స్వామి ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ స్వామి, ముఖ్య సలహాదారు బెంజ్జంకి వడ్ల స్వామి, కుమార్ గల్లి స్వామి, సభ్యులు భరతకుమార్ స్వామి, సంతోష స్వామి, పర్జన్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
