📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

సీఎం జన్మదినం సందర్భంగా వినతిపత్రం అందజేసి నిరసన తెలిపిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
సీఎం జన్మదినం సందర్భంగా వినతిపత్రం అందజేసి నిరసన తెలిపిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు
  • 27వ రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె – రెగ్యులరైజేషన్‌ను జన్మదిన కానుకగా ప్రకటించాలని విజ్ఞప్తి
నిర్మల్ నవంబర్ 8 సాక్షర ప్రతినిధి. ఎన్ హెచ్ ఎం జేఏసి ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల నిరవధిక సమ్మె 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని NHM ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు.ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా “మాకు రెగ్యులరైజేషన్ అనే పుట్టినరోజు కానుక ఇవ్వండి” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ....ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఎన్ హెచ్ ఎంఉద్యోగులకు ఈ ప్రత్యేక సందర్భంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలు అందించిన తమ సేవలను ప్రభుత్వం గుర్తించి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.27 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు.
తెలంగాణ రాష్ట్రంలోని NHM వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
ఐదు శాతం వార్షిక ఇంక్రిమెంట్, ఎనిమిది శాతం లాయల్టీ బోనస్ వెంటనే చెల్లించాలి.
కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఎల్ హెచ్ ఎం జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.