📅 Monday, 02 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS నిర్మల్‌లో రేపు జిల్లా స్థాయి యువజనోత్సవం ఐదు విభాగాల్లో పోటీలు..
‹
›
District News

అక్టోబర్ లో 89 శాతం బొగ్గు ఉత్పత్తి.

◉ M VIJAYA   |   ◷ Latest
అక్టోబర్ లో 89 శాతం బొగ్గు ఉత్పత్తి.
  • బెల్లంపల్లి ఏరియా జిఎం ఎం.శ్రీరమేష్.
రెబ్బెన,సాక్షర:బెల్లంపల్లి ఏరియాలో అక్టోబర్ నెలలో 89శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీరమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అక్టోబర్ నెలలో టార్గెట్ 3లక్షల టన్నులు కాగా 2.68లక్షల టన్నులు ఉత్పత్తి సాధించామన్నారు.వార్షిక బొగ్గు ఉత్పత్తి మాత్రం అక్టోబర్ మాసం ముగిసేవరకు 107శాతంతో వార్షిక లక్ష్యాలను అధిగమించే దిశగా ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 35లక్షల టన్నులు కాగా అక్టోబర్ మాసం ముగిసే వరకు 19.86లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్లు వెల్లడించారు.ఓబి అక్టోబర్ మాసంలో 128శాతం తీసామన్నారు.వర్షాలు తగ్గుముఖం పట్టినందున ఉద్యోగులు ఉత్సాహంగా పని చేసి ఉత్పత్తిలో బెల్లంపల్లి ఏరియా ను సింగరేణిలో అగ్రగామిగా నిలపాలని కోరారు.