📅 Monday, 02 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS అక్టోబర్ లో 89 శాతం బొగ్గు ఉత్పత్తి.
‹
›
District News

శ్రమతోనే కాదు క్రీడా పోటీల్లోను సత్తా చాటాలి..

◉ M VIJAYA   |   ◷ Latest
శ్రమతోనే కాదు క్రీడా పోటీల్లోను సత్తా చాటాలి..
  • దేవరకొండ కిరణ్ బాబు డిజిఎం పర్సనల్.
రెబ్బెన,సాక్షర:శ్రమతో బొగ్గు ఉత్పత్తిలో ప్రతిభ చూపుతున్న సింగరేణి ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రీడా పోటీల్లోనూ సత్తా చాటాలని బెల్లంపల్లి ఏరియా డీజీఎం పర్సనల్ దేవరకొండ కిరణ్ బాబు అన్నారు. డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ 93వ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా సోమవారం గోలేటిలోని శ్రీ భీమన్న క్రీడా మైదానంలో నియర్ బై క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల ఉద్యోగ క్రీడాకారులు ప్రతి దినం నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సమిష్టిగా పోటీల్లో పాల్గొని కోల్ ఇండియా స్థాయిలో రాణించాలని అన్నారు. కంపనీ స్థాయి క్రికెట్ పోటీలు మందమర్రిలో జరగనున్నందున ఉద్యోగ క్రీడాకారులు మరింత సాధన చేయాలని సూచించారు.కోల్ ఇండియా స్థాయి పతకాలే లక్ష్యంగా పోటీల్లో రాణించాలని పేర్కొన్నారు.అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటియూసి నాయకుడు మారం శ్రీనివాస్,వర్క్ షాప్ హెచ్ఓడి జ్ఞానేశ్వర్,డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ గౌరవ కార్యదర్శి డి.ప్రశాంత్,స్పోర్ట్స్ సూపర్వైసర్ అశోక్,స్పోర్ట్స్ కోఅర్దినేటర్ కిరణ్ బాబు,జనరల్ క్యాప్టెన్ ఎస్కే అబ్బాస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.