- ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు.. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి: పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశం
నిర్మల్, నవంబర్ 18: సాక్షర ప్రతినిధి.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీస్ అధికారులు తక్షణమే స్పందించాలని, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.కుటుంబ సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై షీ టీం సిబ్బంది ఇరువర్గాలతో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకునేలా తగిన సూచనలు చేశారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు గ్రీవెన్స్ డే ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement