📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
22°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

బాసర సర్కిల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
బాసర సర్కిల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
  • 2026–2029 సంవత్సరాలకు అధ్యక్షుడిగా టి.పుండలిక్, ప్రధాన కార్యదర్శిగా జి.వి.రామకృష్ణ ఎన్నిక
నిర్మల్ నవంబర్ 22 సాక్షర ప్రతినిధి
తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాసర సర్కిల్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాసర సర్కిల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. 2026–29 సంవత్సరాలకు సంబంధించి నిర్వహించిన ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ ఎన్నికలను తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రణీత్ కౌర్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించగా, ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించారు.అధ్యక్షులు.టి. పుండలిక్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వర్ని.ఉపాధ్యక్షురాలు అనిత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఎఫ్.ఎస్.పి., బాసర, హెడ్‌క్వార్టర్స్ నిర్మల్.ప్రధాన కార్యదర్శి జి.వి. రామకృష్ణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్,నిర్మల్.సంయుక్త కార్యదర్శి పద్మారావు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్,జగిత్యాల.కోశాధికారి రవి మోహన్ భట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇందల్వాయి.
ఆర్గనైజింగ్ సెక్రటరీ రాథోడ్ అవినాష్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఆదిలాబాద్.
అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.అటవీ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు
ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం నూతన కార్యవర్గం ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అధికారుల న్యాయమైన హక్కులు, సేవా ప్రయోజనాలు, పదోన్నతులు, బదిలీలు,విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంఘం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అటవీ సంరక్షణ,వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ ఆక్రమణల నివారణ,అటవీ నేరాల నియంత్రణ వంటి కీలక బాధ్యతలను రేంజ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, తగినంత సిబ్బంది,విధి నిర్వహణలో భద్రత,అనుకూలమైన పని వాతావరణం కల్పించేలా సంఘం కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.అటవీ అధికారుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి, గౌరవప్రదమైన సేవా వాతావరణం పెంపొందించేందుకు నూతన కార్యవర్గం బలమైన వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.