📅 Sunday, 01 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS కరువు కోరల్లో తలమడుగు రైతులు.. తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి: కేటీఆర్
‹
›
District News

ట్రస్మ ఫౌండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా "విద్యా ప్రదాత పురస్కార మహోత్స వం - 2026"

◉ T PRAKASH RAO   |   ◷ Latest
ట్రస్మ ఫౌండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా "విద్యా ప్రదాత పురస్కార మహోత్స వం - 2026"
  • 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్ కరెస్పాండెంట్లకు ఘనంగా సత్కారం
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 1: తెలంగాణ రికగ్నైసేడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ (ట్రస్మ) ఫౌండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో "విద్యా ప్రదాత పురస్కార మహోత్స వం - 2026" ఆదివారం నిజామాబాద్ నగరంలోని శ్రీ రాం గార్డెన్s లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్స్లర్ వై ఎల్ శ్రీనివాస్ ప్రత్యేక ఆహ్వానితుడిగా విచ్చేసి ప్రసంగిస్తూ దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ, స్వతంత్రం నాటినుండి విద్యాభివృద్ధి బోధన విధానాల గురించి ఎంతో ఆసక్తిగా కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశంలో బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థ నేటికీ కొనసాగుతుందని, దేశంలో ప్రస్తుతం మారుతున్న సాంకేతికత కాలనుగుణంగా విద్యా విధానంలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. నాటి విద్యా విధానం వల్ల కేవలం ఉద్యోగ అవకాశాల కోసమే చదువుతున్నారని, దీంతో విద్యార్థులు సొంతంగా ఆలోచించే విజ్ఞానం పరిజ్ఞానం కొరవడిందని, ప్రపంచ దేశాలతో పోలిస్తే నూతన ఆవిష్కరణలు చేయడంలో వెనుకబడి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొడాలి కిషన్ రావు,
ట్రస్మ జిల్లా అధ్యక్షుడు కిశోర్, స్టేట్ జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్, స్టేట్ అనరరే ప్రెసిడెంట్ కండాల పాపిరెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పి జయ ప్రకాష్, స్టేట్ ట్రెజరీ శ్రీకాంత్ రెడ్డి, చీఫ్ అడ్వైజర్ కె అనంతరెడ్డి, డిస్టిక్ హన్నారరి ప్రెసిడెంట్ ఈగ శ్యాంసుందర్ రెడ్డి, డిస్టిక్ జనరల్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, డిస్టిక్ ట్రెజరీ రెడ్డి సత్యనారాయణ, డిస్టిక్ కన్వీనర్ రాజు గుజరాతి, ట్రస్మా బోధన్ డివిజన్ సెక్రెటరీ అనిల్ కుమార్, డివిజన్ ట్రెజరరీ m.సురేష్, బోధన్ మండల్ హానరరీ ప్రెసిడెంట్ వై శ్రీనివాసు, మండల్ ప్రెసిడెంట్ హరికృష్ణ, జనరల్ సెక్రెటరీ సురేష్, ట్రెజరీ కృష్ణమోహన్ హాజరయ్యారు. ఈ మహోత్సవంలో జిల్లాలోని (above 25yrs) ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. trsma సభ్యుల ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పాఠశాలల్లో కరెస్పాండెంట్లకు trsma ఫౌండర్ సభ్యుల ముఖ్య అతిథుల సమక్షంలో సభ్యుల ఆధ్వర్యంలో memonto తో పాటు శాలువాలు పూలదండలతో ఘనంగా సన్మానించారు ఏ సన్మాన మహోత్సవంలో 42 మంది వివిధ పాఠశాలల కరస్పాండెంట్లను ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన మహోత్సవంలో భారీ సంఖ్యలో ప్రవేట్ టీచర్లు ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.