📅 Sunday, 01 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ట్రస్మ ఫౌండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా "విద్యా ప్రదాత పురస్కార మహోత్స వం - 2026"
‹
›
District News

కరువు కోరల్లో తలమడుగు రైతులు.. తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి: కేటీఆర్

◉ Arsha Dayakar   |   ◷ Latest
కరువు కోరల్లో తలమడుగు రైతులు.. తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి: కేటీఆర్
తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? రైతుల ఆత్మహత్యలు పాలకులకు పట్టవా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తలమడుగు మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తలమడుగు ప్రాంతంలో రైతులు సాగునీరు, పంటల దిగుబడి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి తలమడుగును కరువు మండలంగా ప్రకటించి, బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, సర్పంచ్ ఎలుగు రాజన్న,నాయకులు వసంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,ఏలుగు ప్రేమేందర్, అభిరామ్ రెడ్డి, సంజీవరెడ్డి, కేదర్శివరెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.