📅 Sunday, 01 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
29°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష
‹
›
District News

Writing 20వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
Writing
20వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె
  • చేతులపై మెహందీతో డిమాండ్లు రాసుకొని వినూత్న నిరసన.. 20 ఏళ్ల సేవలకు గుర్తింపేది?
నిర్మల్ నవంబర్ 1 సాక్షర ప్రతినిధి.
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల నిరవధిక సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరుకుంది.సమ్మెలో భాగంగా ఉద్యోగులు తమ చేతులపై మెహందీతో డిమాండ్లు రాసుకొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నప్పటికీ తమ జీవితాల్లో ఆర్థిక భరోసా, ఉద్యోగ భద్రత లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
20 ఏళ్ల సేవలకు తగిన గుర్తింపు ఏదీ?...........
ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బాధ్యతలు నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ వేతనాల్లో తగిన పెరుగుదల లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు తెలిపారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు పెరిగిపోవడంతో చాలీచాలని జీతాలతో జీవనం సాగించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా సేవలందిస్తున్న తమకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేకపోవడం బాధాకరమన్నారు.ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రధాన డిమాండ్లు
తమ సేవలను ప్రభుత్వం గుర్తించి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. క్రమబద్ధీకరణ జరిగే వరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు కల్పించాలని, వార్షిక ఇంక్రిమెంట్లు, 8 శాతం లాయల్టీ బోనస్, ఆరోగ్య బీమా సదుపాయంతో కూడిన హెల్త్ కార్డులు అందించాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు కూడా ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు.సేవలకు తగిన గౌరవం కల్పించాలి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాత్ర కీలకమని,గ్రామీణ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య కార్యక్రమాల అమలులో వారు నిరంతరం పనిచేస్తున్నారని ఉద్యోగులు పేర్కొన్నారు.రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న తమ జీవితాల్లో స్థిరత్వం కల్పించేలా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కేవలం హామీలతో కాకుండా తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని, ఉద్యోగులను
క్రమబద్ధీకరించే ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.