సాక్షర,బోథ్: బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాతర్ల లో విగ్రహానికి అవష్కరించి, అక్కడ నుంచి సంస్కృతీ సంప్రదాయాలతో కాలి నడక తో బజార్ హత్నూర్ కి తరలి వచ్చారు మరియు కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆదివాసీలు తమ సంప్రదాయ వేషధారణలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు, ఆటపాటలతో సందడి చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల్లో మునిగితేలుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. జల్, జంగల్, జమీన్ నినాదాలతో కొమురం భీమ్‌కు ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, స్థానిక మండల తహసీల్దార్ శ్యామ్ సుందర్, ఇంచార్జ్ ఏం పి డీ ఓ మహేందర్ రెడ్డి, డీ టీ హీరాలాల్, ఆర్ ఐ నూర్ సింగ్, మహేందర్, గోడం గణేష్, జలై జాకు, స్థానిక ఎస్ ఐ లు రమేష్,పురోషోత్తం,పోలీస్ సిబ్బంది,విగ్రహ సాధనా కమిటీ అధ్యక్షులు తొడసాం ఈశం రావ్, ఉప అధ్యక్షులు గేడం దయానంద్, ప్రధాన కార్యదర్శి ఆత్రం గోపాల్, కోశాధికారి మేశ్రం ప్రకాష్,మేశ్రం జంగు బాపు, వివిధ గ్రామ పంచాయతీ సర్పంచులు, గ్రామ పటేల్లు,సార్ మేడిలు, తుడుం దెబ్బ నాయకులు ఉయకే సుదర్శన్, జల్కె పాండు రంగ్, నైతం రమేష్,యూవతి, యూవకులు, మహిళలు,చిన్నారులు, మండల స్థాయి ప్రజలు,9 తెగల ఆదివాసుల కళ బృందం,తదితరులు పాల్గొన్నారు.
— ELUGU VAMSHIDHARAdilabad dist coordinator