భక్తి శ్రద్దలతో శ్రీ తులసీమాత మహోత్సవం
జన్నారం మండలకేంద్రంలో శ్రీ తులసీమాత కళ్యాణమహోత్సవం భక్తులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. శనివారం రోజున కార్తీకమాసం ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ ఆంజనేయస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఆలయ పురోహితులు గుండి గణేష్ శర్మ పురోహితులు గుండి సత్యనారాయణ శర్మ గుండి నరహరి శర్మ ల అద్వర్యంలో శ్రీ తులసీమాత కళ్యాణమహోత్సవం కన్నులపండుగగా నిర్వహించారు. ఈ సందర్బంగా పురోహితులు మొదటగా అమ్మవారికి అభిషేఖం అర్చన ప్రత్యేక పూజల అనంతరం కళ్యాణ మహోత్సవం చేశారు. అదేవిదంగా ఈరొజు ఈ కార్యక్రమం జరుపోడానికి గల విశిష్టతను భక్తులకు తెలిపారు. మహిళలు ప్రత్యేక పారాయణాలు భజనలు కోలాటాలు చేశారు ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కార్యక్రమ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అలయకమిటి అద్యక్షులు జక్కు సత్తయ్య సబ్యులు గుండా లచ్చన్న గౌరిశెట్టి నారాయణ ఉత్తూరి ప్రభాకర్ గుండా సుదాకర్ లతోపాటు భక్తులు ఈగం చంద్రమౌళి వెంకటేష్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
