నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : నిజామాబాద్ జిల్లాలో హెచ్ఐవి / ఎయిడ్స్ నిర్ధారణ నియంత్రణ నివారణ కార్యక్రమాల అమలులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డాప్క్యూ సిబ్బంది, కనబరిచిన పనితీరు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో గణనీయమైన ప్రగతి కనబరిచి నిజాంబాద్ జిల్లా సురక్షిత కేటగిరిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో నాకు డిప్యూటీడైరెక్టర్ నరేష్ రెడ్డి , డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి రాజశ్రీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఐ డి ఓ సి లో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నాకు ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సురక్షితగిరికి నిజామాబాద్ జిల్లా ఎంపికవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సురక్షిత గుర్తింపు జిల్లా యంత్రాంగం వైద్యానికి శాఖ ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారులు సిబ్బంది ఐ సి టి సి ఏ ఆర్ టి సి ఎస్ సి కేంద్రాలు స్వచ్ఛంద సేవా సంస్థలు సంబంధిత సిబ్బంది సమిష్టి కృషి సమన్వయంతో సాధ్యమైందని తెలిపారు. ఇంతటితో సంతృప్తి చెందకుండా ఇదే స్పూర్తితో హెచ్ఐవి నిర్ధారణ, నివారణ ,విస్తృత స్థాయిలో పరీక్షలు, సకాలంలో చికిత్స అందించడం, హెచ్ఐవి తో జీవిస్తున్న వారికి నిరంతర వైద్య సేవలు కల్పించడం వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. ప్రజలను అవగాహన పెంపొందిస్తూ ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నరేష్ రెడ్డి ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ, అడిషనల్ డైరెక్టర్ ఫనీ రేఖ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ భార్గవి, ఏఆర్టి వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్, డిపిఎం సుధాకర్, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, సి ఎస్ ఓ నవీన్ , సిపిఓ మోహిజ్ ,వై ఆర్ జి సుధాకర్ , సహాయోగి సమత, స్నేహ సొసైటీ శివ, సిఎస్సి కోఆర్డినేటర్ అఖిల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer
Advertisement