📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

ఆరోగ్య వారోత్సవాలు పోస్టర్లు, కరపత్రాలు విడుదల

◉ Kodishetti Sathish   |   ◷ Latest
ఆరోగ్య వారోత్సవాలు పోస్టర్లు, కరపత్రాలు విడుదల
మంచిర్యాల సాక్షర:
మంచిర్యాల జిల్లాలో ప్రజారోగ్యమే లక్ష్యంగా ఈ నెలలో పలు కీలక ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అనిల్ కుమార్‌లతో కలిసి ఈ వారంలో ఈ నెలలోనిర్వహించనున్న వివిధ వైద్య ఆరోగ్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలను అధికారికంగా విడుదల చేశారు.
​ఈ నెల 12వ తేదీ నుండి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పి హెస్ సీ లు ఉప కేంద్రాలు గ్రామాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.
​ ప్రపంచ నిమోనియా దినోత్సవం నిమోనియా నివారిద్దాం చిన్నారుల ప్రాణాలను కాపాడుదాంనవంబర్ 12 నుండి జిల్లావ్యాప్తంగా నిమోనియా నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ప్రమాదంలో ఉన్నవారు: 5 సంవత్సరాల లోపు పిల్లలు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, పోషకాహార లోపం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
​ప్రధాన లక్షణాలు దగ్గు, కఫం, జ్వరం, జలుబు ఎక్కువ కావడం, వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాసించేటప్పుడు పక్కటెముకలు కదలడం, ఛాతి లోనికి వెళ్లడం, పాలు తాగలేకపోవడం, బాగా నీరసంగా ఉండడం పెదవులు, నాలుక నీలంగా మారడం వంటి ప్రమాద హెచ్చరికలు కనిపిస్తాయి.
​తీసుకోవాల్సిన జాగ్రత్తలు &

నివారణ:
​పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలి. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే, ఆ తర్వాత ఘనహారం అందించాలి.
​సరైన సమయంలో అన్ని రకాల టీకాలు వేయించాలి.
​చలికాలంలో పిల్లలను వెచ్చటి బట్టలతో కప్పి ఉంచాలి.
​వండే ముందు, తినే ముందు, మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
​పిల్లల్లో దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బంది ఉంటే ఇంటి వద్దే వైద్యం చేస్తూ సమయం వృధా చేయకుండా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా ఆరోగ్య కార్యకర్త వద్దకు తీసుకువెళ్లాలి.
​ నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలు నవంబర్ 15 - 21ప్రతి నవజాత శిశువు ఆరోగ్యవంతమైన ప్రారంభం ఉజ్వల భవిష్యత్తుకు బలం అనే నినాదంతో నవంబర్ 15 నుండి 21 వరకు నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, మాతా శిశు సంరక్షణ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆశా కార్యకర్తల ద్వారా తల్లులకు కింది అంశాలపై అవగాహన కల్పిస్తున్నారుపుట్టిన గంటలోపు తల్లిపాలు ముర్రుపాలుపట్టించడం 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం.కంగారు మదర్ కేర్ కె ఏమి సీ ద్వారా బిడ్డకు అవసరమైన వెచ్చదనాన్ని కల్పించడం.సరైన సమయంలో టీకాలు ఇప్పించడం, సురక్షితమైన నిద్రను ఏర్పాటు చేయడం.
​తల్లి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, క్రమం తప్పకుండా శిశువుకు ఆరోగ్య పరీక్షలు చేయించడం.
​శిశు మరణాలను పూర్తిగా తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, సీహెచ్‌వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేవ్, శ్రీనివాస్, సుమన్, సురేందర్, ఆర్ఎస్ పద్మ, శంకర్, రవి తదితర వైద్యులు మరియు పర్యవేక్షకులు పాల్గొన్నారు.