గిరిజన విద్యార్థులు మంచిగా చదువుకోవాలి విద్యతోనే అభివృద్ధి ఐ టి డి ఏ పిఒ మకరంద్
గిరిజన విద్యార్థులు మంచిగా చదువుకోవాలని విద్యతోనే అన్ని సాదించవచ్చు అని ఉట్నూర్ ఐ టి డి ఏ పిఒ మకరంద్ అన్నారు. శుక్రవారం రోజున మండలంలోని మారుమూల గిరిజన గ్రామం కొత్తపేట గ్రామ పంచాయితీలోని కోలాంగూడ లో మండల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో త్రాగునీరు రహదారులు విద్య ఉపాది తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలలోని విద్యార్థులు మంచిగా క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలని విద్యతో తమకు తాము ఉన్నతస్థాయికి ఎదుగుతూ తమ కుటుంబాలు గ్రామాలు సైతం అబివృద్ది చెందుతాయని అయన అన్నారు. గ్రామాల అబివృద్దికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నదని దానిని ప్రతి ఒక్క గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు. ఈ ఒక్కరు కూడా ప్రభుత్వ వ్యతిరేక విదానాలవైపు చూడవద్దని క్రమశిక్షణతో వుంటే మంచి బవిష్యత్ ఉంటుందని అయన తెలిపారు. అదేవిదంగా గ్రామంలోని పెద్దలు ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామాల అబివృద్దికి కృషి చేస్తూ గ్రామంలో కాని ప్రజలకు కాని ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని ఈ సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించేవిదంగా చర్యలు చేపట్టాలని అయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ బక్కయ్య మండల ఉపాది హామీ అధికారి రవీందర్ మండల రెవెన్యు అధికారి వెంకటేశం గ్రామ సర్పంచ్ దినేష్ గ్రామ పటేల్ కొడప ముత్తుకోవా పంచాయితి కార్యదర్శి బీంరావు గ్రామస్తులు సోనేరావు ఆనందరావు గోపి జైవాంత్ రావు తిరుపతి అంగన్వాడి హౌసింగ్ తదితర శాఖల అధికారులు సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
