పశుగ్రాసం పంటకు రైతులకు ఆర్థిక ప్రోత్సాహం
జన్నారం మండలంలోని రైతులకు పశుగ్రాసం పంటకు ఆర్థిక ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తున్నట్లు మండల పశువైద్యాదికారి డా; కస్తూరి శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం రోజున అయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థుతులలో రైతులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రబుత్వం వారి వారి భూములలో పశుగ్రాసాన్ని పండిస్తే ఎకరానికి 14 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మండలకేంద్రంలోని పశువుల ఆసుపత్రిలో సంప్రదించాలని భూమి పట్టపాస్ పుస్తకం ఆదార్ కార్డు రైతు బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ పేపర్లను ఇవ్వాలని అయన తెలిపారు. అదేవిదంగా గ్రామాలలో నీటి తోట్టెలు ఏర్పాటుచేసి పశువులకు నీటి సమస్యరాకుండా చూడాలని రైతులు అధికారులు సిబ్బంది అందరం కలిసి పశుగ్రాసం సాగును ప్రోత్సహించడం, పశువులకు తాగునీటి సదుపాయాలు కల్పించడం ద్వారా పశుసంపదను సంరక్షించుకోవచ్చని, రైతులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని అయన సూచించారు.
