మూడవ విడత అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి
- జిల్లా కలెక్టర్‌కు మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల వినతి
మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు మూడవ విడత అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ నిరంతరం బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న విలేకరులకు అక్రిడిటేషన్ కార్డులు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, విధి నిర్వహణలో అధికారిక గుర్తింపునకు ఈ కార్డులు ఎంతో అవసరమని తెలిపారు.
ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జర్నలిస్టుల హెల్త్ కార్డుల పునరుద్ధరణకు కార్యాచరణ చేపడుతున్న నేపథ్యంలో, వైద్య సహాయం పొందడానికి అక్రిడిటేషన్ కార్డు ప్రామాణికంగా మారనుందని చెప్పారు. మన జిల్లాలో మూడవ విడత కార్డుల జారీలో జాప్యం జరిగితే, అర్హులైన జర్నలిస్టులు ఈ వైద్య సదుపాయాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు.మొదటి రెండు విడతల్లో మిగిలిపోయిన అర్హుల దరఖాస్తులు ఇప్పటికే పరిశీలన దశలో ఉన్నందున, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి వెంటనే మూడవ విడత అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ న్యాయం జరిగేలా త్వరితగతిన గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కోరారు ఈ కార్యక్రమం లొ డేగ సత్యం ప్రకాష్ రెడ్డి సురేష్ సంపత్ తదితరులు పాల్గొన్నారు
