మేట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి కూలీలకు న్యాయం చేయాలి
- చెన్నూరులో 30 మంది ఉపాధి హామీ మేట్లకు విబి గ్రామ్ వి బి గ్రామగ్ శిక్షణ
చెన్నూరు మండల కేంద్రంలో సోమవారం ఉపాధి హామీ పథకానికి చెందిన 30 మంది మేట్లకు 'విబి గ్రామ్ పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో హాజరై 'విబి గ్రామ్' చట్టం, దాని నిబంధనలపై మేట్లకు సమగ్రంగా వివరించారు. ఉపాధి హామీ పనులలోమేట్లపాత్రకీలకమైనదని, క్షేత్రస్థాయిలో వాళ్ళు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ముఖ్యంగా ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేలా చేపట్టవలసిన ముందస్తు పనుల గురించి అవగాహన కల్పించారు.
అలాగే గ్రామీణ కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన నోటిఫైడ్ వేతన రేటు ఏ విధంగా అందుతుందో, మస్టర్ల నిర్వహణను ఎలా చేపట్టాలో స్పష్టంగా తెలియజేశారు. కూలీలందరికీ పూర్తిస్థాయిలో పని దినాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఏపీవో శ్రీమతి జి. గంగాభవాని, సిడిసి ఎల్ఆర్సి సురేష్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ టి. చంద్రశేఖర్, టెక్నికల్ అసిస్టెంట్లు రవికుమార్, వెంకటేష్, రవీందర్, తిరుమల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
