📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
28°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS గ్రామాల్లో సమస్యలు లేకుండా చూసుకోవాలి ఏం ఎల్ ఏ బోజ్జు పటేల్
‹
›
District News

కాకతీయ నగర్‌లో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
కాకతీయ నగర్‌లో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్
రామచంద్రపురం: పదవిలో లేకపోయినా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్‌పై కాకతీయ నగర్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ రోడ్ నంబర్ 5లో మంజూరైన నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను గురువారం బూరుగడ్డ పుష్పనగేష్ కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. కాలనీ అధ్యక్షుడు అమృత్ సాగర్ విజ్ఞప్తి మేరకు పనుల పురోగతిని పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంకా పరిష్కారం కావాల్సిన పలు మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. కాలనీలోని సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, అవసరమైన నిధులు మంజూరు చేసి డివిజన్‌లోని సమస్యల పరిష్కారానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పదవిలో లేకున్నా కాలనీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి బూరుగడ్డ పుష్పనగేష్ కృషి చేయడం అభినందనీయమని కాలనీ వాసులు పేర్కొన్నారు.