పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు
- సైబర్ నేరాలు, ఈ-పెట్టి కేసులను త్వరితగతిన పరిష్కరించాలి – జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల డీడీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశించారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సైబర్ వారియర్స్‌తో ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సైబర్ క్రైమ్ కేసుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సైబర్ కేసును నిరంతరం పర్యవేక్షిస్తూ, దర్యాప్తులో వేగం పెంచాలని సూచించారు. కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, బాధితులకు సకాలంలో న్యాయం అందించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే ఈ-పెట్టి (E-Petty) కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఎలాంటి కారణం లేకుండా కేసులను పెండింగ్‌లో ఉంచవద్దని ఎస్హెచ్ఓలకు స్పష్టం చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించిన డీడీలను కూడా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయకూడదని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులపై నిరంతర సమీక్ష నిర్వహిస్తూ, వాటి పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఉపేందర్ రెడ్డి, సీఐలు కృష్ణ, మల్లేష్, ఎస్సైలు లింబాద్రి, అశోక్, ముత్యం, మహిళా ఎస్సై శ్రావణితో పాటు డీసీఆర్బీ, ఐటీ కోర్, సైబర్ క్రైమ్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
