📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

లంబడిపల్లి గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ పర్యటన

◉ Kodishetti Sathish   |   ◷ Latest
లంబడిపల్లి గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ పర్యటన



చెన్నూరు సాక్షర :
మంచిర్యాల అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సందర్బంగా శనివారం చెన్నూరుమండలంలోని లంబడిపల్లి గ్రామపంచాయతీ నందు పర్యటించారుఈ కార్యక్రమం లొ భాగంగా గ్రామంలో నూతనంగానిర్మాణంజరుపుకుంటున్న గ్రామపంచాయతీ భవనమును వీఓ భవనమును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో వీబీ గ్రామగ్ పథకంలో భాగంగా చేపడుతున్న ఇంకుడు గుంతల నిర్మాణం, అలాగే బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ పనులను స్వయంగాపరిశీలించిఅధికారులకు పలు సూచనలు చేశారు.
తదుపరి గ్రామంలోని ప్లాస్టిక్ నిర్వహణ యూనిట్ న పరచిలించి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సరఫరా కు ఎలాంటి అంతరాయం కలగకుండా వేసవి దృష్ట్యా నీటి సమస్యలు తలెత్తకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో ఎల్-నినో ప్రభావంతో కరువు పరిస్థితి ఏర్పడకుండా ముందస్తుగా చేపట్టాల్సిన నిర్వహణ పనులపై సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎంపీడీఓ భాస్కర్ లంబడిపల్లి సర్పంచ్,మహేష్ గహలోతు ఉపాధి హామీ ఎం.పీ.ఓ, ఉపాధి హామీ ఈ.సీ, టెక్నికల్ అసిస్టెంట్ టి ఏ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.