📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
State News

ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

◉ T PRAKASH RAO   |   ◷ Latest
ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్


నిజామాబాద్ ప్రతినిధి , సాక్షర :: భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళగా పేరుగాంచిన దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు, మాజీ మంత్రులు దానం నాగేందర్, గీతారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. యావత్ ప్రపంచం ఉక్కు మహిళగా కీర్తించిన ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. దేశాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరా గాంధీ నిరంతరం కృషి చేశారని అన్నారు. 'గరీబీ హటావో' నినాదం పేదరిక నిర్మూలన పట్ల ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశం కోసం అనునిత్యం శ్రమించిన మహానాయకురాలు ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు.