ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
- సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో క్విజ్, వ్యాసరచన పోటీలు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోన్ మండల పరిధిలోనీ సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు బానాల నరేందర్ విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యంలో ఓటు పాత్ర, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరంగా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విలువను గుర్తించి,ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు భూమారెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, బానాల నరేందర్, ముర్తుజాఖాన్, విశ్వనాథ్, బద్దం సాయిరెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
