📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

రీసర్వేతో గ్రామాలలో భూముల సమస్యలు పరిష్కారం ఏ డి ఐ శేషారావు

◉ Kotha Venugopal   |   ◷ Latest
రీసర్వేతో గ్రామాలలో భూముల సమస్యలు పరిష్కారం ఏ డి ఐ శేషారావు
జన్నారం సాక్షర
రీసర్వేతో గ్రామాలలోని భూమి సమస్యలు అన్ని పరిష్కరం అవుతాయని జిల్లా అదనపు సర్వేయర్ శేషారావు తెలిపారు. బుదవారం రోజున మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మండల రెవెన్యు అధికారులు ఏర్పాటుచేసిన భూముల రీసర్వే పై అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన అయన మాట్లాడుతూ చాలాకాలంనుండి గ్రామాలలో అనేకరకాల భూమి సమస్యలు వున్నాయని గ్రామాలలో భూమి సమస్యలు లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంబించిందని అయన తెలిపారు. ఈ రీసర్వేలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్వే చేయడం జరుగుతుందని ప్రజలనుండి సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రభుత్వ నిబందనల ప్రకారం ఈ భూముల రీ సర్వే చేయడం జరుగుతుందని అయన తెలిపారు. ఈ సర్వే అనంతరం ప్రతి భూమికి ఒక భూదార్ సంఖ్య హద్దులతో కూడిన చిత్రపటం పట్టాదారులకు అందించడం జరుగుతుందని అయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ బక్కయ్య గ్రామ సర్పంచ్ గుగ్లవాత్ సంగీతరవినాయక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.