ఇందిరానగర్ లో పేద వృద్ధులకు అల్పాహారం పంపిణీ..
రెబ్బెన,సాక్షర:సంజీవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం పేద వృద్ధులకు అల్పాహారాన్ని శనివారం రోజు సీనియర్ నాయకుడు బోమ్మినేని సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు.ఈ సందర్భంగా సంజీవని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దీకొండ సంజయ్ కుమార్ తోపాటు బొమ్మినేని సత్యనారాయణ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలో ఎంతో మానసిక ఆనందం ఉంటుందని ప్రతి ఒక్కరు సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలని అన్నారు.ప్రతిరోజు వృద్ధులకు రెండు పూటలా అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు రాజు,మహేందర్ తదితరులున్నారు.
