బ్యాంకులు సేవా దృక్పథంతో పనిచేయాలి: NDCCB 104 వ వ్యవస్థాపక దినోత్సవంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర, నవంబర్ 19 : బ్యాంకులు లాభ అపేక్షతోనే కాకుండా రైతులకు ప్రజలకు సేవా దృక్పథంతో పనిచేయ వలసిన సామాజిక బాధ్యత బాధ్యత ఉందని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు.
గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (NDCCB) 104 వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ప్రధాన కార్యాలయంలో బ్యాంక్ CEO నాగభూషణం వందే, బ్యాంక్ జనరల్ మేనేజర్ అనుపమ ఆదరణలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగస్తులు బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు, ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లి. యొక్క 104 వ వ్యవస్థాపక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరిపిన ఉత్సవాలలో భాగంగా బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన అదనపు కలెక్టర్ రాజా గౌడ్ తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి.లక్ష్మీనారాయణ, బ్యాంక్ CEO నాగభూషణం వందే, బ్యాంక్ జనరల్ మేనేజర్ అనుపమ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్యాంక్ CEO నాగభూషణం స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిగా నిలిచారు. అదేవిధంగా బ్యాంక్ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల సిబ్బంది ఉత్సాహంగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి. లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, బ్యాంక్ CEO, జనరల్ మేనేజర్లు, ఇతర అధికారులు మరియు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, అత్యవసర సమయాల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా సామాజిక బాధ్యతతో పాటు మానవతా విలువలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు.
