📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

విదేశీ రాజకీయ ప్రతినిధిపై చర్యలు తీసుకోవాలి -భారత్ సమ్మిట్ పేరుతో చట్టపరమైన ఉల్లంఘన * పోలీస్ కమిషనర్ కూ ఎమ్మెల్యే ధన్ పాల్ వినతి

◉ T PRAKASH RAO   |   ◷ Latest
విదేశీ రాజకీయ ప్రతినిధిపై చర్యలు తీసుకోవాలి 
-భారత్ సమ్మిట్ పేరుతో చట్టపరమైన ఉల్లంఘన
* పోలీస్ కమిషనర్ కూ ఎమ్మెల్యే ధన్ పాల్ వినతి
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : ఇటీవల హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్ లో విదేశీ రాజకీయ నాయకుడు జియోకోమో ఫిలిటిక్ చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విదేశీయుడైన జియోకోమో తన ప్రసంగంతో వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. కావున పూర్తి విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన సదస్సులో ప్రసంగిస్తూ " ఓటు చోర్.. గద్ది చోడ్" అనే నినాదం చేసి, భారత అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా చెప్పడం తగదన్నారు. ఇందుకు రాహుల్ గాంధీ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వడం సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశంలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు, వర్క్ షాప్ లు ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు విదేశీ ప్రతినిధులు దేశ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని గుర్తు చేశారు. అలాగే ప్రత్యేక పొలిటికల్ క్లియరెన్స్ ఇస్తుందన్నారు. కానీ వీటన్నిటి ఉల్లంఘిస్తూ ప్రసంగం చేయడం దేశ పౌరులను అవమానించడమేనన్నారు. కావున ఈ ఉల్లంఘనలను పరిగణలోకి తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరారు.