- రాగం రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న యాదవ సోదరులు
రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఆదివారం మార్కెట్ సమీపంలో రాగం రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ప్రొటెం స్పీకర్ వి. భూపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నగేష్, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్, పటాన్చెరు సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. సదర్ ఉత్సవాల్లో భాగంగా యాదవ సోదరులు దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి వాటితో సంప్రదాయ విన్యాసాలు చేయించారు. ఊరేళ్ల రాజు, శివ యాదవ్‌తో పాటు పలువురు యాదవ సోదరులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దున్నపోతుల విన్యాసాలు, సంప్రదాయ సంబరాలు అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాగం రమేష్ యాదవ్ మాట్లాడుతూ, తరతరాలుగా కొనసాగుతున్న యాదవుల సదర్ సంప్రదాయం ఎంతో గొప్పదని అన్నారు. తాము శ్రీకృష్ణుడి వారసులమని, మల్లన్న స్వామిని కులదైవంగా కొలవడం తమ అదృష్టమని పేర్కొన్నారు. రామచంద్రపురంలో యాదవ సోదరులందరూ ఐక్యంగా కలిసిమెలిసి ఈ పండుగను ఘనంగా, సంతోషంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పాడి పశువులే యాదవుల జీవనాధారమని, అందుకే వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి సదర్ వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. యాదవులందరూ ఒకే వేదికపైకి వచ్చి తమ సంప్రదాయాలను, సంస్కృతిని భావితరాలకు అందించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బైకన్ సాయిలు యాదవ్, రాగం శ్రవణ్ యాదవ్, బైకన్ నవీన్ యాదవ్, భాస్కర్, రాములు యాదవ్, రాగం సోమయ్య, సోమేష్, రామచందర్ యాదవ్, ఊరేళ్ల రాజు, సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు, యాదవ సోదరులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter