📅 Saturday, 31 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి సారంగాపూర్ కాంగ్రెస్ శ్రేణుల పయనం
‹
›
District News

పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవకు పెద్దపీట

◉ Kodishetti Sathish   |   ◷ Latest
పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవకు పెద్దపీట
  • కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు
చెన్నూరు సాక్షర :కోటపల్లి పోలీస్ అమరవీరులసంస్మరణవారోత్సవాలను పురస్కరించుకుని సమాజరక్షణకోసంప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవా స్ఫూర్తిని కొనసాగించే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ, జైపూర్ ఏసీపీ పర్యవేక్షణలో చెన్నూరు రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు.చెన్నూరు రూరల్ సర్కిల్ కార్యాలయ ఆవరణతో పాటు కోటపల్లి పోలీస్ స్టేషన్ వేదికగా నిర్వహించిన ఈ సామాజిక సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపీఎస్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ అధికారులు వారి అంకితభావాన్ని కొనియాడారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. వారు చూపిన ధైర్యం, కర్తవ్యనిష్ఠ, సేవా స్ఫూర్తి ప్రతి పోలీస్ అధికారికి ఆదర్శమని తెలిపారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
134 యూనిట్ల రక్త సేకరణ.. రక్తదానానికి యువత విశేష స్పందన
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి యువత, స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, ఇతర అనారోగ్య సమస్యల సమయంలో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని, ఆరోగ్యపరంగా అర్హులైన వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.పోలీసుల పిలుపునకు స్పందించిన యువకులు,స్థానిక ప్రజలు ఉత్సాహంగా రక్తదానం చేయగా, ఈ శిబిరంలో మొత్తం 134 యూనిట్ల రక్తాన్ని సేకరించడం విశేషం. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఈ రక్తం ఉపయోగపడనుంది. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన దాతలను అధికారులు అభినందించారు.
సుమారు 100 మందికి ఉచిత కంటి పరీక్షలఅదేవిధంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య సలహాలు అందించారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షల పట్ల నిర్లక్ష్యం వహించే ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, సమయానికి కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను కేవలం స్మరణ కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ సంక్షేమ, సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతోముందుకుసాగుతోంది.ఈ కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు చీరల పంపిణీ, గ్రామీణ ప్రాంత యువతలో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేందుకు వాలీబాల్ కిట్ల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, చెన్నూరు రూరల్ సర్కిల్ పరిధిలోని డ్రైవర్లకు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు పొందేలా ప్రత్యేక చొరవ తీసుకోవడం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించారు.మహిళలకు అండగా నిలవడంగ్రామీణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, డ్రైవర్లకు చట్టబద్ధమైన డ్రైవింగ్ లైసెన్సులు సులభంగా పొందేలా సహకరించడం వంటి చర్యలు సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమానికిదోహదపడనున్నాయి.ముఖ్యంగా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డ్రైవింగ్ లైసెన్సులకల్పనకుసహకరించాలనే పోలీసులచొరవపారదర్శకతకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలనే లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల కోసం పోలీస్ శాఖపోలీస్ శాఖ విధులు కేవలం నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కావని, ప్రజల కష్టసుఖాల్లోభాగస్వాములవుతూ, వారి ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక అభివృద్ధికి తోడ్పడటం కూడా పోలీసుల సామాజిక బాధ్యతలో భాగమని ఈ కార్యక్రమంమరోసారిచాటిచెప్పింది.ప్రజలు,పోలీసుల మధ్య స్నేహపూర్వకసంబంధాలుమరింత బలోపేతం కావడానికి,పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం,భరోసా పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలుస్తూ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్.కృష్ణ,కోటపల్లి ఎస్సై రాజశేఖర్, నిల్వాయి ఎస్సై నాగరాజు,రెడ్‌క్రాస్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ మహేందర్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్,ఉత్తమ్, కోటపల్లి మండల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,పోలీస్ సిబ్బంది, యువకులు,పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.