📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

కడ్తల్ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
కడ్తల్ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరు
  • పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ నవంబర్ 16 సాక్షర ప్రతినిధి.
నిర్మల్ నియోజకవర్గంలోని కడ్తల్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరైనట్లు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రూ.39.81 లక్షల నికర నిధులు ప్రస్తుతం మంజూరయ్యాయని వెల్లడించారు.
ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.ఈ మేరకు సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో మార్కింగ్ పూర్తి చేసి, అభివృద్ధి పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని సూచించారు. నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.అదేవిధంగా ఆలయం పక్కన ఉన్న షెడ్ నిర్మాణం,ఇతర అభివృద్ధి పనుల కోసం అదనపు నిధులు మంజూరు చేయించేందుకు కూడా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.అనేక సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి సేవలో నిమగ్నమై, ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నర్సారెడ్డి స్వామి, చిన్నయ్య స్వామి సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అభివృద్ధి పట్ల వారు చూపుతున్న అంకితభావం,భక్తులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.ఆధ్యాత్మిక కేంద్రంగా కడ్తల్ అయ్యప్ప స్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందేందుకు భవిష్యత్తులోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, రమణారెడ్డి, జమాల్, సరికేల గంగన్న, సాదం అరవింద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీపీ హరీష్ రెడ్డి, సర్పంచ్ రాజు రెడ్డి, బీజేపీ నాయకులు జుట్టు దినేష్, కందుల హరీష్, అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.