📅 Saturday, 14 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
‹
›
District News

క్రమశిక్షణతో అన్ని సాదించవచ్చు పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్

◉ Kotha Venugopal   |   ◷ Latest
క్రమశిక్షణతో అన్ని సాదించవచ్చు పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్
జన్నారం సాక్షర
పిల్లలు క్రమశిక్షణతో వుంటే అన్ని సాదించవచ్చు అని పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్ అన్నారు. శనివారం రోజున పోనకల్ గ్రామపంచాయితి పరిదిలోని పాత పోనకల్ లో ప్రభుత్వ ప్రాథమిక పాటశాల పిల్లలతో పిల్లల స్నేహ గ్రామసబ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాగంగా విద్యార్థులకు ఈ వారి హక్కులు, బాధ్యతలు, మంచి ఆరోగ్య అలవాట్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వము అందిస్తున్న ప్రాధాన్యత అంశాలను వివరించారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు, వారి ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ.ఐ -AXL కంప్యూటర్ ల్యాబును ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ఈ గ్రామసబకు అద్యక్షత వహించిన ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్ధి పిల్లలు చిన్ననాటినుండే మంచి క్రమశిక్షణతో వుంటే విద్యలో క్రీడలలో ఈ విదంగా సమజసేవలకు సంబందించిన అన్ని రంగాలలో మంచి ఫలితాలు సాదించవచ్చు అని ఆమె అన్నారు. ప్రభుత్వం సైతం విద్యార్థుల సౌకర్యం కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నదని దానిని అందరు సద్వినియోగం చేసుకొని మీరు పుట్టి పెరిగిన ఊరికి కనిపెంచిన తల్లితండ్రులకు క్రమశిక్షణతో కూడిన విద్యనేర్పిన గురువులకు పాటశాలకు మంచి పేరు గుర్తింపులు తేవాలను ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పోనకల్ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఉప సర్పంచ్ అప్పాల జలపతి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎన్. విజయకుమార్, చైర్ పర్సన్ మూల రేణుక, వార్డు సబ్యులు అంజన్న, మొసీన్ , సుగుణ, సంతోష్, మహేందర్, పాఠశాల ఉపాధ్యాయులు కే.రాజేశం, కే.శ్రీకాంత్ మరియుబిల్ కలెక్టర్ అనిల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.