📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

◉ Kotha Venugopal   |   ◷ Latest
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి 
                                                    జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల సాక్షర ప్రతినిది
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, సంబంధిత అధికారులతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తికి చెందిన మాదర బోయిన కోమలత నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండలానికి చెందిన వొడ్నాల శంకర్, కడారి బుచ్చయ్య తాము చేనేత కార్మికులము అని, తమకు పింఛన్ ఇప్పించాలని కోరుతూ వేరువేరుగా అర్జీలు సమర్పించారు. బి.ఎస్.పి. జిల్లా ప్రతినిధి ముల్కల్ల రాజేంద్రప్రసాద్ తన దరఖాస్తులో మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ భూమిని న్యాయపరంగా స్వాధీనపరచుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరారు. కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన దాసరపు సత్తయ్య తాను గతంలో రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూమిని ఇతరుల పేరిట పట్టా చేశారని, ఈ విషయమై తగు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఎ.ఐ.ఎస్.బి. జిల్లా ప్రతినిధి కనుకుంట్ల సన్నీ గౌడ్ తన దరఖాస్తులో బెల్లంపల్లి పట్టణంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం 8వ తరగతి అనుమతితో 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తుందని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మంచిర్యాల పట్టణానికి చెందిన తోట కళావతి తనకు ప్రజాపాలన పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన కుశన శంకరయ్య తన తల్లికి విరాసత్ ద్వారా వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, తమకు తెలియకుండా కొందరు దొంగ పట్టా చేయించుకున్నారని, ఈ విషయమై విచారించి, అట్టి పట్టాను రద్దు పరచి, తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. భీమారం మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన నక్క సత్యం తాను కొనుగోలు చేసిన భూమిలో నిర్మించుకున్న ఇంటికి ఇంటి పన్ను విధించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చెగ్యాం బొందయ్య తనకు గ్రామ శివారులో గల భూమికి సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 58 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సామాన్య ప్రజలకు సేవలు అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ తరఫున జిల్లా న్యాయస్థానం నుండి ఒక అడ్వకేట్ ప్రజావాణిలో అందుబాటులో ఉంటారని, ఎవరైనా నిరుపేదలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు న్యాయ సహాయం, సలహా కొరకు సంప్రదించవచ్చని తెలిపారు. న్యాయస్థానాలలో ఏమైనా కేసుల నమోదు, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి, కోర్టులో సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటారని, ప్రజలు వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.