- వరుస ప్రమాదాలపై సోనాపూర్ ఆదివాసీల ఆందోళన.
రెబ్బెన,సాక్షర:మండలంలోని గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని సోనాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఆవుల మంద పైకి దూసుకెళ్లిన ఘటనలో ఐదు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి.వరుస ప్రమాదాలతో సోనాపూర్ ఆదివాసులు ఆందోళన చెందారు.ఘటన స్థలంలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో మూడు ఆవులు ఒక మేక చనిపోయిందని,ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తారని,కంటి తుడుపు చర్యలతో కాలయాపన చేయడం తప్ప శాశ్వత భద్రతా చర్యలు తీసుకోరన్నారు.ప్రమాదాల నివారణపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో బొగ్గు లారీల అధిక వేగానికి తమ మూగజీవాలను కోల్పోయి తమ జీవనోపాధికి విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాదలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తారని,శాశ్వత పరిష్కారానికి మాత్రం చర్యలు శూన్యమని వాపోయారు.ప్రమాదానికి ప్రధాన కారణాలు బొగ్గు లారీల అధిక వేగంతో పాటు వేగ నియంత్రణ సూచికలు లేకపోవడం,స్పీడ్ కు లిమిట్ లేకపోవడం ప్రధాన కారణమని అన్నారు. కార్యక్రమంలో గోలేటి గ్రామ సర్పంచ్ అజ్మీరా బాబురావు,ఏఐటియుసి నాయకులు మారం శ్రీనివాస్,భోగె ఉపేందర్ గ్రామస్తులు మధుకర్ గౌడ్, ధర్ము తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER