బీజేవైఎం జాతీయ అధ్యక్షులు హేమంగ్ జోషిని ఘనంగా సన్మానించిన రాష్ట్ర కో-కోశాధికారి ఆమంద్ విజయ్ కృష్ణ
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : బీజేవైఎం జాతీయ అధ్యక్షులు హేమంగ్ జోషి తెలంగాణ పర్యటనలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ నేతృత్వంలో జాతీయ అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో-కోశాధికారి ఆమంద్ విజయ్ కృష్ణ హేమంగ్ జోషిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో యువమోర్చా చేపడుతున్న కార్యక్రమాలు, యువతను సంఘటితం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. జాతీయ అధ్యక్షుల మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో యువమోర్చాను మరింత బలోపేతం చేస్తూ, యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆమంద్ విజయ్ కృష్ణ తెలిపారు.
