ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 29వ రోజుకు.. పండుగలు పోయినా ఆగని పోరాటం
- టెంట్‌లోనే దీపావళి వేడుకలు.. కుటుంబాలకు దూరంగా సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగులు – డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని జేఏసీ హెచ్చరిక
నిర్మల్ జిల్లా ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె మంగళవారం 29వ రోజుకు చేరుకుంది. దీపావళి పండుగను సైతం కుటుంబాలకు దూరంగా సమ్మె శిబిరంలోనే జరుపుకున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ప్రధాన డిమాండ్లు:
17 వేల మంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి.
సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలి.
పెండింగ్‌లో ఉన్న 5 శాతం ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ వెంటనే మంజూరు చేయాలి.
180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.
ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
