📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఈ నెల 16న ప్రత్యేక పిల్లల ప్రజావాణి నిర్వహణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

ఓటు హక్కుపై అవగాహనకు వ్యాసరచన, ప్రశ్నోత్తర పోటీలు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ఓటు హక్కుపై అవగాహనకు వ్యాసరచన, ప్రశ్నోత్తర పోటీలు
  • నవంబర్ 13న నిర్మల్‌లో నియోజకవర్గ స్థాయి పోటీలు – ఆర్డీవో దేవిదాస్
నిర్మల్, నవంబర్ 12 (సాక్షర ప్రతినిధి): విద్యార్థులు,యువ ఓటర్లలో ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించేందుకు నియోజకవర్గ స్థాయిలో వ్యాసరచన, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించనున్నట్లు నిర్మల్ ఆర్డీవో, ఎన్నికల నమోదు అధికారి దేవిదాస్ తెలిపారు.
ఎన్నికల అక్షరాస్యత సంఘాల ఆధ్వర్యంలో 009–నిర్మల్ శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.
నవంబర్ 13వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్మల్‌లోని భాగ్యనగర్ నారాయణ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.
సంబంధిత అధికారులు, పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను సకాలంలో పోటీలకు పంపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్డీవో దేవిదాస్ కోరారు.