- టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, జిల్లా అధ్యక్షులు
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : టీఎన్జీవో సంఘం ప్రతి ఉద్యోగికి యెల్లవేళల్లో అందుబాటులో ఉంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పరమావధిగా కృషి చేస్తోందని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ లు వెళ్లడించారు. గురువారం టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు శ్రీమారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SM.హుసేని (ముజీబ్) ఆదేశానుసారం... ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కలెక్టరేట్ (IDOC) కార్యాలయంలో గల జిల్లా విద్యాశాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, TNGO జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ విచ్చేసి ఆయా శాఖల ఉద్యోగుల సమస్యలపై చర్చించిన అనంతరం, 2026-27 సం. నికి గాను టీఎన్జీవో సభ్యత్వాన్ని సదరు శాఖ ఉద్యోగులకు అందజేసి, టీఎన్జీవో సభ్యత్వం ప్రాముఖ్యతను వివరించీ, ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, ఉద్యోగుల సమస్యలే పరమావధిగా భావిస్తున్న టీఎన్జీవో సంఘం, ప్రతి ఉద్యోగికి యెల్లవేళల్లో అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశానికి టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షులు శివకుమార్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, విద్యాశాఖ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అశ్విన్ కుమార్, శోభన్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, వ్యవసాయ శాఖ ఫోరం జిల్లా కార్యదర్శి గోవర్ధన్, ఆయా శాఖల ఉద్యోగులు, మహిళా ఉద్యోగిణులు హాజరై టీఎన్జీవో సభ్యత్వాన్ని స్వీకరించారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer